యంగ్ ఎన్టీఆర్ మూవీతో రంభ రీ ఎంట్రీ !
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

యంగ్ ఎన్టీఆర్ మూవీతో రంభ రీ ఎంట్రీ !

  • రంభ నిన్నటితరం గ్లామర్ హీరోయిన్ 
  • 'యమదొంగ'లో స్పెషల్ సాంగ్ తో సందడి 
  • మళ్లీ ఇన్నాళ్లకి ఎన్టీఆర్ కాంబినేషన్లోనే  
తెలుగు తెరపై నిన్నటితరం గ్లామర్ కథానాయికలుగా ఒక వెలుగు వెలిగినవారిలో 'రంభ' పేరు స్పష్టంగా కనిపిస్తుంది. తెలుగులోని అగ్రహీరోలందరితోను ఆమె నటించి ఆడియన్స్ ను అలరించింది. అనేక విజయాలను తన ఖాతాలో వేసుకుంది. అలాంటి రంభ .. వివాహమైన తరువాత సినిమాలను దూరం పెట్టింది. చాలాకాలం క్రితం ఆమె 'యమదొంగ' సినిమాలో ఎన్టీఆర్ తో కలిసి 'నాచోరే .. నాచోరే' అంటూ ఒక స్పెషల్ సాంగ్ ను చేసింది. అలాంటి రంభ ఇప్పుడు ఎన్టీఆర్ మూవీలో ఒక కీలకమైన పాత్రను చేయనున్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ ఒక సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. సాధారణంగా త్రివిక్రమ్ తన సినిమాల్లో కీలకమైన పాత్రలను సీనియర్ హీరోయిన్స్ తో చేయిస్తుంటాడు. అలా వచ్చినవారే నదియా .. స్నేహ .. ఖుష్బూ. అలాగే ఇప్పుడు ఈ సినిమా కోసం రంభను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. త్వరలోనే ఆమె షూటింగుకి హాజరుకానున్నట్టు చెబుతున్నారు. 
ntr
rambha

More Telugu News